Monday, May 12, 2008
SAKSHI’s survey on Chiranjeevi Party
చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే, ఆ ప్రభావం ఏ పార్టీపై ఎంత వుంటుందన్నది ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. అందరికన్నీ ఎక్కువగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు ఈ సమాచారం మరింత ముఖ్యం. అందుకే ‘సాక్షి’ దినపత్రిక చిరంజీవి రాజకీయ పార్టీ ప్రభావంపై పెద్ద సర్వే చేయించిందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో చిరు పార్టీ పెట్టినా అంత ప్రభావం ఉండబోదని ఆ సర్వేలో తేలిందంటున్నారు. సర్వేకు అవసరమైన గణాంకాల సేకరణ అంతా ‘సాక్షి’ సిబ్బంది సేకరించారు. చిరంజీవి పార్టీ వేడి తగ్గిన తర్వాతే ఈ సర్వే చేయడం వల్ల అలాంటి ఫలితం వచ్చి వుంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి సర్వేల్లో ఒక చిక్కు ఉంది. చిరు పార్టీ వస్తే ప్రభావితమయ్యే పార్టీకి సంబంధించిన వాళ్లే సర్వే జరిపితే దానికే అనుకూలంగా ఫలితాలు కనిపిస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment